VIDEO: గరికపాటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా AISF నిరసన
ATP: విద్యార్థుల మధ్యాహ్న భోజనంపై అవమానకర వ్యాఖ్యలు చేసిన గరికపాటి నరసింహరావు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని AISF నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గరికపాటి చిత్రపటాలను చించి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు మాట్లాడుతూ.. గరికపాటి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలన్నారు.