20న చిట్వేలులో మెగా జాబ్ మేళా

అన్నమయ్య: మహర్షి అభ్యుదయ సేవా సంస్థ సహకారంతో మార్చి 20న చిట్వేలిలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. చిట్వేలులోని శ్రీ పద్మావతి హైస్కూల్ నందు గురువారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మోటోరోలా కంపెనీ వారిచే ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.