'రైజింగ్ విజన్ 2047 సర్వేలో భాగస్వాములు కావాలి'
NRPT: తెలంగాణ రైజింగ్ విజన్ 2047 సర్వేలో ఉద్యోగులు, విద్యార్థులు అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిస్తున్న విజన్ 2047లో ప్రజలు తమ విలువైన సలహాలు సూచనలు అందించాలని అన్నారు.