కేంద్రమంత్రికి రామయ్య ప్రసాదం అందజేత
BDK: భద్రాచలం బీజేపీ పార్టీ నాయకులు ఇవాళ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రామయ్య కళ్యాణ తలంబ్రాలను, ప్రసాదము వారికి అందజేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రామాలయం అభివృద్ధికి బీజేపీ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ పాల్గొన్నారు.