నీరుకొండలో ఎన్టీఆర్ స్మృతివనం

నీరుకొండలో ఎన్టీఆర్ స్మృతివనం

GNTR: తెలుగు వారి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించేలా అమరావతిలో ఎన్టీఆర్ స్మృతివనం ప్రాజెక్టును చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, భాష, సాహిత్యం, కళలు, చరిత్రకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. శనివారం ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై సీఎం సమీక్ష నిర్వహించారు.