లవ్‌లో ఫెయిల్.. ఉద్యోగి సూసైడ్
HYD: ప్రేమ విఫలమైందని మనస్తాపంతో ఐటీ ఉద్యోగి సూసైడ్ చేసుకున్న ఘటన ఘట్కేసర్‌లో జరిగింది. స్నేహితుల వివరాలు.. గుంటూరు జిల్లా వాసి కుర్ర పవన్ కళ్యాణ్ రెడ్డి (26) సింగపూర్ టౌన్‌షిప్‌లో అద్దెకుంటూ, ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. లవ్ ఫెయిల్ అయిందన్న బాధలో అతను తన గదిలో ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.