మరో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం: కలెక్టర్

WNP: రానున్న మరో మూడు రోజులు జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా పకడ్బందీగా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. గత 24 గంటల నుంచి పడిన వర్షాలకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు.