స్టార్ క్రికెటర్‌పై జీవితకాల నిషేధం

స్టార్ క్రికెటర్‌పై జీవితకాల నిషేధం

జింబాబ్వే క్రికెట్‌కు 20 ఏళ్లపాటు సేవలందించిన మాజీ కెప్టెన్ సీన్ విలియమ్స్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు వేటు వేసింది. డ్రగ్ అడిక్షన్‌తో బాధపడుతూ రిహాబ్‌కు వెళ్లానని సీన్ స్వయంగా బోర్డుకు తెలిపాడు. ఈ క్రమంలో క్రమశిక్షణ, యాంటీ డోపింగ్ చర్యలతో అతణ్ని ఇకపై జాతీయ జట్టుకు ఎంపిక చేయబోమని బోర్డ్ ప్రకటించింది. కాగా అతని కాంట్రాక్ట్ త్వరలో ముగుస్తుంది.