భాషా సంఘం అధ్యక్షుడిగా త్రివిక్రమరావు
AP: మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘానికి అధ్యక్షుడిగా పి.త్రివిక్రమరావు ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు ఆయన అధ్యక్ష పదవిలో కొనసాగుతారని వెల్లడించింది.