గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
NDL: డోన్ మండలం కోట్లవారిపల్లె సమీపంలోని ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ వద్ద మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు డోన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు డోన్ పోలీసులను సంప్రదించాలని తెలిపారు.