అంతర్గత రోడ్డులో గుంతలు పూడ్చివేత
KNR: చొప్పదండి మండలం బొమ్మకల్ గ్రామంలోని అంతర్గత రోడ్డులో గుంతల కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈరోజు ఉదయం పంచాయతీ ఆధ్వర్యంలో మరమ్మతులు చేపట్టారు. గుంతలను మట్టి, గ్రావెల్‌తో పూడ్చారు. మధ్యాహ్నం నుంచి వాహన రాకపోకలు సాఫీగా కొనసాగుతున్నాయి.