ఎన్నికల కౌంటింగ్‌ను పర్యవేక్షిస్తున్న కలెక్టర్
NGKL: జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యుల మొదటి ఫేజ్ పోలింగ్ ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని కల్వకుర్తి, ఊర్కోండ, వెల్దండ, వంగూరు, తాడూరు, తెలకపల్లి ఆరు మండలాల్లో మొదటి ఫేజ్ పోలింగ్ శాతం 86.32 నమోదైంది. ఈ మండలాల్లో మొత్తం 1,81,543, ఓట్లకుగాను 1,56,710 ఓట్లు పోలయ్యాయి. ఉదయం నుంచి పోలింగ్ సరళిని, మధ్యాహ్నం నుంచి కౌంటింగ్‌ను కలెక్టర్ బాదావత్ సంతోష్ పర్యవేక్షిస్తున్నారు.