ట్రాన్స్ జెండర్ సన్నిధికి నగదు అందించిన కలెక్టర్

ట్రాన్స్ జెండర్ సన్నిధికి నగదు అందించిన కలెక్టర్

ELR: ఏలూరులో శుక్రవారం జరిగిన ఎయిడ్స్ అవగాహన 5కె మారథాన్ రెడ్ రన్‌లో CH. సన్నిధికి అరుదైన గౌరవం దక్కింది. ట్రాన్స్ జెండర్ విభాగంలో ప్రథమ బహుమతి అందుకున్నారు. కలెక్టర్ వెట్రిసెల్వి రూ.10 వేల నగదు, ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ట్రాన్స్ జెండర్లకు సమాజంలో గౌరవం, సమాన అవకాశాలు రావాలని, యువత ప్రతిభను నిరూపించుకునే వేదికలు పెరగాలని సూచించారు.