జిల్లాలో డ్రోన్‌ల అనధికార వినియోగంపై ఆంక్షలు

TPT: తిరుపతి జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాల అనధికార వినియోగంపై ఆంక్షలు విధించినట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం శనివారం తెలిపింది. తిరుపతి జిల్లా భద్రతాపరంగా సున్నితమైన ప్రాంతం కావడంతో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఆంక్షలు విధించామని పేర్కొన్నారు. అనధికారికంగా డ్రోన్ కెమెరాలు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.