అర్హులైన పేదలకే ఇళ్లు ఇవ్వాలి: సీఐటీయూ

అర్హులైన పేదలకే ఇళ్లు ఇవ్వాలి: సీఐటీయూ

SRPT: హుజూర్‌నగర్ పట్టణంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు కేటాయించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం తహసీల్దార్ కవితకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమయ్య గౌడ్ మాట్లాడుతూ.. ఫణిగిరి గుట్ట వద్ద ఉన్న ఇళ్లను పారదర్శకంగా, దళారుల ప్రమేయం లేకుండా కేటాయించాలన్నారు. అనర్హులను తొలగించి, పేదలకు న్యాయం చేయాలని అన్నారు.