5న తిరుమలలో కార్తీక పౌర్ణమి గరుడ సేవ
TPT: తిరుమలలో ఈనెల 5న కార్తీక పౌర్ణమి గరుడసేవ జరగనుంది. ఆ నాటి రాత్రి 7 నుంచి 9 గంటల వరకు నాలుగు మాడ వీధుల్లో స్వామివారు విహరించనున్నారు. ముందుగా సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ.. భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అనంతరం స్వామి వారి నిత్య కైంకర్యాలు నిర్వహించనున్నారు.