నాగార్జునసాగర్ 8 గేట్లు ఎత్తివేత
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగుల గాను ప్రస్తుతం 589.60 అడుగులు ఉంది. దీంతో ప్రాజెక్టు 8 గేట్లను 5 అడుగుల మేర పైకి ఎత్తి నీటిని దిగువనకు విడుదల చేశారు. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.