ఒకే గ్రామంలో 9 మందికి టీచర్‌ ఉద్యోగాలు

ఒకే గ్రామంలో 9 మందికి టీచర్‌ ఉద్యోగాలు

ATP: కుందుర్పి మండలం తెనగల్లు గ్రామంలో డీఎస్సీ ఫలితాల్లో ఏకంగా తొమ్మిది మంది టీచర్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. తెనగల్లు గ్రామానికి చెందిన శ్రీకాంత్‌, జ్యోతి, లక్ష్మణమూర్తి, తేజు, భాను, నీలకంఠేశ్వరప్ప, హరీశ్‌, గంగాధర్‌, సురేశ్‌ బాబు ఉపాధ్యాయ కొలువులు సాధించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వారిని సన్మానించి అభినందనలు తెలిపారు.