నియోజకవర్గ సమస్యలపై ఎందుకు మాట్లాడలేదు: రమేశ్ బాబు
కృష్ణా: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తీరుపై మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు తీవ్రంగా మండిపడ్డారు. నియోజకవర్గ సమస్యలను పట్టించుకోకుండా, అసెంబ్లీలో రిషికొండ గురించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. సభలు, ఉత్సవాల పేరుతో ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. నియోజకవర్గానికి సంబంధించిన కీలక సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తేలేదన్నారు.