BRSలో మహిళలకు గౌరవం లేదు: శోభారాణి
HYD: BRS పార్టీలో మహిళలను గౌరవించే సంప్రదాయం లేదని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ ఛైర్పర్సన్ బండ్రు శోభారాణి, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్పర్సన్ కాల్వ సుజాతలు విమర్శించారు. ఇవాళ గాంధీభవన్‌లో వారు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక BRSకు ఫైనల్ పరీక్ష అని, ఓడిపోతే ఆ పార్టీ కథ ముగిసినట్లేనని అన్నారు.