జిల్లా నిరుద్యోగులకు ముఖ్య గమనిక

ప్రకాశం: ఒంగోలు గ్రామీణాభివృద్ధి స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఏసీ, ఫ్రిజ్ రిపేరింగ్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ శాఖ అధికారులు శనివారం తెలిపారు. ఈ శిక్షణ మే నెల 21 నుంచి జూన్ 19వ తేదీ వరకు ఉంటుందన్నారు. 19 నుంచి 45 ఏళ్లలోపు వారు అర్హులని, శిక్షణ సమయంలో భోజనం, వసతి పూర్తిగా ఉచితం అని పేర్కొన్నారు.