ఏపీలో అరటి రైతుల కష్టాలు

ఏపీలో అరటి రైతుల కష్టాలు

AP: అనంతపురంలో అరటి రైతులు అరిగోస పడుతున్నారు. టన్ను అరటి రూ.28 వేల నుంచి రూ.వెయ్యికి పడిపోయింది. అనంతపురంలో రూపాయికే రూ.కిలో అరటిపళ్లు లభిస్తున్నాయి. దీంతో అరటి రైతులు పంటను ట్రాక్టర్లతో తొలగిస్తున్నారు. తాడిపత్రి, నార్పల, పుట్లూరు, యాడికి సహా గిట్టుబాటు ధర లేక అరటిపళ్లను రోడ్లపై పడేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.