'రాజ్యాంగంతో అన్ని వర్గాలకు సమాన హక్కులు'
MNCL: మంచిర్యాలలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. భారత దేశ రాజ్యాంగానికి మహోన్నతమైనదని, అన్ని వర్గాలకు సమాన హక్కులను కల్పించిందన్నారు.