స్నానాల లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం పర్యటన

KMM: వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. లక్ష్మీపురం గ్రామ సమీపంలోని వాగుపై నిర్మాణం చేపట్టిన చెక్ డ్యామ్ పనులను, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో నిర్మాణం చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అభివృద్ధి పనులను త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.