మొంథా తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: MLA

మొంథా తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: MLA

SKLM: మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సూచించారు. ఈ నెల 28,29 తేదీల్లో తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో శ్రీకాకుళం కంట్రోల్ రూమ్ 08942-240557ను సంప్రదించాలని కోరారు.