VIDEO: జంపనిలో కలెక్టర్ పర్యటన.. ధాన్యం పరిశీలన
BPT: వేమూరు మండలం జంపని గ్రామంలో కలెక్టర్ వి.వినోద్ కుమార్ పర్యటించారు. బుధవారం రహదారులపై రైతులు ఆరబోసిన ధాన్యాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి, ధాన్యం నాణ్యత, తేమ శాతంపై ఆరా తీశారు. కొనుగోలు కేంద్రాల ద్వారా పంటను విక్రయించుకోవాలని సూచించారు. ఈ మేరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.