గుండెపోటుతో కూలీ మృతి

గుండెపోటుతో కూలీ మృతి

W.G: దేవరపల్లి మండలం త్యాజంపూడి గ్రామానికి చెందిన కొప్పు చంద్రమౌళి (45)అనే వ్యవసాయ కూలీ సోమవారం ఉదయం వ్యవసాయ పనులు చేస్తుండగా కుప్పకూలి మృతి చెందాడు. సంగాయగూడెం ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తుండగా అపస్మారక స్థితికి చేరుకున్న చంద్రమౌళిని ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. గుండెపోటుతోనే మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.