పాఠశాలకు బీరువా వితరణ

పాఠశాలకు బీరువా వితరణ

ELR: నూజివీడు మండలం మద్దాయికుంట గ్రామంలోని మోడల్ ప్రైమరీ స్కూల్‌కు రూ. 15 వేలు విలువ చేసే బీరువాను మర్రి బంధం ప్రముఖులు పూషాడపు శ్రీనివాసరావు సోమవారం వితరణ చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం దారపురెడ్డి భాస్కరరావు మాట్లాడుతూ.. విద్యార్థుల అభ్యున్నతికి శ్రీనివాసరావు చేసే సేవలు అభినందనీయమన్నారు. అనంతరం ఉపాధ్యాయులు దాత శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు.