తిరుచానూరు ఆలయాన్ని సందర్శించిన రాష్ట్రపతి
AP: తిరుమల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ ఆలయ సంప్రదాయం ప్రకారం ఘనస్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.