'అద్దె ఇళ్ల కార్మికులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి'

'అద్దె ఇళ్ల కార్మికులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి'

సత్యసాయి: సోమందేపల్లి మండలంలో అద్దె ఇళ్లలో నివసిస్తూ మగ్గాలు నేస్తున్న చేనేత కార్మికులకు కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం డిమాండ్ చేసింది. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా తహసీల్దార్ మారుతి ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. మగ్గం నేస్తూ అద్దె ఇళ్లలో ఉన్న చేనేత కార్మికులకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరారు.