'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
కృష్ణా: ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ద్రోణి ప్రభావంతో కృష్ణా జిల్లాలోని విజయవాడ, గుడివాడ, గన్నవరం ప్రాంతాలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు గంటల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 50 - 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు.