గుండెపోటుతో రైతు మృతి
SRD: గుండెపోటుతో రైతు మృతి చెందిన ఘటన కల్హేర్ మండలం పౌమ్యనాయక్ తండాలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. పౌమ్యతాండకు చెందిన ధారావత్ గణపతి (62) అనే రైతు ఇవాళ తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేచారు. ఆ సమయంలో చల్లని చలికి వణుకుతూ హఠాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలాడు. అదే సమయంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు.