పంట నష్టాన్ని పరిశీలించిన వ్యవసాయ అధికారి
JN: ఇటీవల కురిసిన మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలను దేవరుప్పుల మండల వ్యవసాయ అధికారి దివ్య, ఏఈవో సంతోష్‌తో కలిసి సోమవారం ఉమ్మడి మాదాపురం గ్రామంలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తడిసిన ధాన్యంపై ఉప్పు ద్రావణం చల్లుకోవాలని సూచించారు. అడ్డం పడిన వరిని కట్టలు కట్టాలన్నారు. దీంతో కొంత నష్ట తీవ్రత తగ్గుతుంది తెలిపారు.