పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం సాయినగర్ తండాలో మద్యానికి బానిసైన రాథోడ్ లక్ష్మణ్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ శనివారం తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు మద్యానికి బానిసైన లక్ష్మణ్, శుక్రవారం ఇంట్లో భార్య లేని సమయంలో మద్యం మత్తులో పురుగుల మందు తాగినట్లు ఎస్సై తెలిపారు.