ప్రమాదవశాత్తు మంటల్లో కాలిపోయిన ఆటో

ప్రమాదవశాత్తు మంటల్లో కాలిపోయిన ఆటో

PDPL: గోదావరిఖని పట్టణంలోని అస్లాంకు చెందిన ఆటో ప్రమాదవశాత్తు శనివారం కాలిపోయింది. ఇంటి ఎదుట పార్కింగ్ చేసిన ఆటోలో ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు వెంటనే గమనించి మంటలను ఆర్పివేశారు. అయినప్పటికీ ఆటో పూర్తిగా దగ్ధమైంది. నిరుపేద కుటుంబానికి చెందిన అస్లాంను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.