ఘనంగా అగ్నిమాపక దినోత్సవం

VZM: గజపతినగరంలో సోమవారం అగ్నిమాపక దినోత్సవం అగ్నిమాపక కేంద్రం అధికారి రవి ప్రసాద్ పర్యవేక్షణలో జరిగింది. గజపతినగరం పంచాయతీ కార్య నిర్వహణ అధికారి జి.జనార్దనరావు మాట్లాడుతూ.. ప్రమాదాలపై ప్రజలకు అవగాహన అవసరం అన్నారు. నాడు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక సిబ్బందికి మౌనం పాటించి నివాళులు అర్పించారు. వారోత్సవాలను జండా ఊపి ప్రారంభించారు.