VIDEO: నిమ్మనపల్లెలో సీసీ రోడ్లకు భూమి పూజ
అన్నమయ్య: అగ్రహారం పంచాయతీలో రూ.54 లక్షలతో మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణానికి మదనపల్లి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా భూమి పూజ నిర్వహించారు. అగ్రహారం, ఆర్‌పీ రెడ్డి గారిపల్లి, చింతపర్తి వారి పల్లి, చెరువు ముందరపల్లి గ్రామాల్లో ఈ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామాభివృద్ధికి అవసరమైన ఇతర పనులను కూడా తన దృష్టికి తీసుకువస్తే మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.