ఇంటింటికి చెత్త వర్గీకరణపై ప్రజలకు అవగాహన
కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర నగరంలోని 33, 44 డివిజన్లలో మంగళవారం పర్యటన నిర్వహించి పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికి చెత్తను తడి, పొడిగా వేరు చేయాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ, క్లాప్ ఆటోల పనితీరుపై అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.