సమస్యను పరిష్కరించిన విద్యుత్ అధికారులు
MBNR: మహమ్మదాబాద్ మండల పరిధిలోని నంచర్లలోని కొన్ని కాలనీల ప్రజలు లో-వోల్టేజ్ సమస్యతో ఇబ్బందులు పడ్డారు. మాజీ సర్పంచ్ నారాయణ ఈ సమస్యను విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి అభ్యర్థన మేరకు శుక్రవారం వెంటనే స్పందించిన విద్యుత్ అధికారులు లైన్‌మెన్ సహకారంతో 25 కేవీ సామర్థ్యం గల టీడీఆర్‌ను ఏర్పాటు చేసి, విద్యుత్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు.