ఘోర ప్రమాదం.. బైక్‌ను ఢీకొన్న కారు
NLG: గుర్రంపోడ్ మండలం చేపూర్ రోడ్డు వద్ద ఇవాళ విషాదం నెలకొంది. అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గుర్రంపోడ్ మండలానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసమైంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.