నీట మునిగిన క్రీడా ప్రాంగణాలు
VKB: గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని నాయకులు చెబుతున్నా అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ప్రజాధనం వృథాగా మారుతోంది. అభివృద్ధికి బాటలు వేయాల్సిన అధికారులు, వర్షం నీరు నిలిచే ప్రాంతంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. ఈ నీటమునిగిన ప్రాంగణాల్లో క్రీడాకారులను ఎలా తయారు చేస్తారోనని మండలంలోని యువకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.