భూకంపం, సునామీలపై రేపు మాక్ డ్రిల్
భూకంపం, సునామీలపై అండమాన్ నికోబార్ దీవుల్లోని విపత్తు నిర్వహణ డైరెక్టరేట్ రేపు మాక్ డ్రిల్‌ను నిర్వహించనుంది. ఈ మాక్ డ్రిల్ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై 11:30 గంటలకు ముగుస్తుందని అధికారులు వెల్లడించారు. అండమాన్-నికోబార్ కమాండ్, NDRF, ఇన్‌కాయిస్ సహా ఇతర అత్యవసర సహాయక బృందాలు ఇందులో పాల్గొంటాయని తెలిపారు.