సినిమా జర్నీ ఆపేద్దామనుకున్నా: కృతి శెట్టి
హీరోయిన్ కృతి శెట్టి తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'ఉప్పెన మూవీ నా జీవితాన్ని మార్చేసింది. నటన అనేది నిజంగా డిమాండ్ ఉన్న పనే. కానీ నటిగా నాకు కొన్ని అంచనాలు ఉన్నాయి. దాంతో ఒత్తిడి ఉండేది. ఒత్తిడి కారణంగా ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను. దీంతో సినిమా జర్నీ ఆపేద్దామనుకున్నా. 'ఉప్పెన'పై ప్రేక్షకులు చూపిన ప్రేమతోనే సినిమాల్లో నటించాలని అనుకున్నా' అని తెలిపింది.