బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని హామీ

బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని హామీ

కర్నూలు: నగరంలో కొనసాగుతున్న రహదారి విస్తరణ పనుల వల్ల భూములు, భవనాలు కోల్పోతున్న ప్రజలందరికీ పూర్తి స్థాయి న్యాయం చేస్తామని కమిషనర్ విశ్వనాథ భరోసా ఇచ్చారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో కిడ్స్ వరల్డ్-బుధవారపేట బ్రిడ్జి (RDP-2), చెక్‌పోస్ట్-SS గార్డెన్స్ మార్గాలపై జరుగుతున్న పనుల పురోగతిని పట్టణ ప్రణాళిక అధికారులతో పరిశీలించారు.