విద్యుత్ సమస్యలుంటే కాల్ చేయండి

వరంగల్: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రైతులు, వినియోగదారులకు విద్యుత్ సమస్యలు ఏర్పడితే 1912, 18004250028 టోల్-ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ మధుసూదన్ ఒక ప్రకటనలో తెలిపారు. లేదా సమీప విద్యుత్ కార్యాలయంలోని అధికారులు, సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు.