కొనసాగుతున్న చాముండేశ్వరి జయంతి మహోత్సవాలు

CTR: పుంగనూరు అర్బన్ ఈస్ట్ పేటలోని శ్రీ చాముండేశ్వరి మాత జయంతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి . శనివారం అర్చకులు అమ్మవారి శిల విగ్రహాన్ని పవిత్ర జలాలతో అభిషేకించారు. తర్వాత 108 వివిధ రకాల పుష్పాలతో అలంకరించి, కుంకుమార్చనలు చేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించి అమ్మవారిని పూజించారు.