స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసిన పోలీసులు

స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసిన పోలీసులు

VZM: జాతీయ రహదారి ఎస్‌కోట నుండి అరకు వైపు ఉన్న రహదారుల వద్ద గురువారం సీఐ నారాయణమూర్తి ఆధ్వర్యంలో తారు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వెంకటరమణ పేట జంక్షన్, కాపు సోంపురం జంక్షన్, పోతనాపల్లి వై జంక్షన్, రాజీపేట, గౌరీపురం, భవాని నగర్ జంక్షన్‌లలో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేశారు. ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.