పాము కాటుతో మహిళ మృతి

పాము కాటుతో మహిళ మృతి

KMM: పాము కాటుకు గురై మహిళ మృతి చెందిన సంఘటన ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన శీలం సంధ్య(40) ఇంటి ఆవరణంలో వాకింగ్ చేస్తుండగా పాము కాటుకు గురైంది. చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో మరణించినట్లు తెలిపారు. సంధ్య‌కు భర్త, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.