రాచరికం నుంచి రిపబ్లిక్ వరకు.. నేపాల్ హిస్టరీ
నేపాల్‌లో శతాబ్దాలపాటు రాచరిక పాలన ఉండేది. 1960లో కింగ్ మహేంద్ర పార్లమెంటును రద్దు చేసి పార్టీలు లేని పంచాయతీ వ్యవస్థను తీసుకొచ్చారు. 1990లో రాజు బీరేంద్ర రాజకీయ పార్టీలపై నిషేధాన్ని ఎత్తేశారు. 1996లో నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ రాచరికాన్ని పడగొట్టటానికి తిరుగుబాటును ప్రారంభించింది. 2001లో బీరేంద్రను చంపేశారు. 2008లో 240 ఏళ్ల రాచరిక పాలన రద్దయి గణతంత్ర రాజ్యంగా మారింది.