మలేరియా నియంత్రణపై అవగాహన పెంచాలి: కలెక్టర్
ATP: మలేరియా నియంత్రణకు క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ ఓ. ఆనంద్ ఆదేశించారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో పోస్టర్లను ఆవిష్కరించారు. వైద్య, విద్య, మున్సిపల్ శాఖల సమన్వయంతో టాస్క్ ఫోర్స్ బృందాలు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి డ్రై డే ప్రాముఖ్యత వివరించాలని సూచించారు.